తెలంగాణలో కొత్తగా 106 కరోనా పాజిటివ్ కేసులు

  • గత 24 గంటల్లో 22,650 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 49 కేసులు
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • ఇంకా 3,879 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 22,650 కరోనా పరీక్షలు నిర్వహించగా, 106 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. వీటిలో అత్యధిక భాగం జీహెచ్ఎంసీ పరిధిలోనివే. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 49 కేసులు నమోదయ్యాయి. జగిత్యాల, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కొమరంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, ములుగు, నాగర్ కర్నూల్, నారాయణపేట, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 179 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒక మరణం సంభవించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,72,052 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,64,212 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,879 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,961కి పెరిగింది.

Telangana
Corona Virus
Today Cases
Media Report

More Telugu News